ETV Bharat / state

జలనిధి.. మన విధి! - కడప జిల్లాలో జలశక్తి అభియాన్ పథకం వార్తలు

భూగర్భ జలాల పెంపుదలకు అధికారులు కసరత్తులు చేస్తూనే ఉన్నారు. కడప జిల్లాలో జలశక్తి అభియాన్‌ అమలు చేయనున్నారు. ఈ సారి 1,01,746 పనులకు ప్రతిపాదనలు చేయగా.. నీటి సంరక్షణకు రూ.1,919.93 కోట్లు ఇచ్చేవిధంగా అమోదం లభించింది.

ljalashakti abhiyan
చెక్ డ్యాంలో నీటికళ
author img

By

Published : May 11, 2021, 7:12 PM IST

వాన నీటిని సంరక్షించి.. భూగర్భ జలాలను పెంచాలన్న లక్ష్యంతో జిల్లా యంత్రాంగం జలశక్తి అభియాన్‌ పనులకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. క్షేత్రస్థాయిలో అమలు తీరుపై కసరత్తు చేస్తోంది. జిల్లాలో 2021- 22 ఆర్థిక సంవత్సరంలో జలశక్తి అభియాన్‌ పథకంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కలిసి 1,01,746 పనులు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.1,919.93 కోట్లు నిధులు కావాలని నివేదించారు. జిల్లా నుంచి జలస్ఫూర్తితో పంపిన దస్త్రానికి ఆమోదం లభించింది.

పెరిగిపోతున్న అవసరాలు..

జిల్లాలో 2011 జనాభా గణన ప్రకారం చూస్తే 28,28,2000 మంది ఉన్నారు. 2022 నాటికి 31,17,171 మందికి పెరుగుతారని అంచనా. 2016లో ప్రజలకు 134.877 హెక్టా మీటర్లు నీటి అవసరం ఉండేది. వచ్చే ఏడాదిలో గృహ వినియోగం కోసం 140.272 హెక్టా మీటర్లు కావాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. రానున్న ఏడాదిలో పశు సంపద సంఖ్య 38,26,232 ఉంటే వాటికోసం 99.482 హె.మీ జలం కావాలి. వ్యవసాయ పంటలు సగటున 1.47 లక్షల హెక్టార్లలో సాగు కానున్నాయి. ఇందుకోసం 91,581 హె.మీ నీరు కావాలి. గొట్టపు బావులు 92,049 ఉన్నాయి. జిల్లాలో గృహ, పశు సంపద, పంటల సాగు, పారిశ్రామిక అవసరాలకు కలిపి 1,59,515.60 హెక్టా మీటర్ల మేర నీరు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం 98,515.60 హె.మీ. జలం అందుబాటులో ఉంది. కొరతను అధిగమించేలా జల సంరక్షణకు నడుంబిగించారు.

ఏ శాఖలో ఏం చేస్తారంటే..

జల వనరుల శాఖ పర్యవేక్షణలో ఉన్న సంప్రదాయ జల వనరులైన కుంటలు, చెరువుల పునరుద్ధరణ కోసం 648 పనులు చేయాలి, ఇందుకోసం రూ.151.86 కోట్లు కావాలని అడిగారు. మరో 151 చోట్ల బాగుచేసేందుకు రూ.47.80 కోట్లు, ఇతర పనులు 314 చేయడానికి రూ.121.94 కోట్లు ఇవ్వాలని నివేదించారు.

  • గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ పర్యవేక్షణలో నింగి నుంచి భవనాలపై కురిసే వాన చినుకులను నేలలోకి ఇంకించి సంరక్షించేందుకు గాను 2,943 పనులు చేయడానికి రూ.36.79 కోట్లు, గొట్టపు బావుల్లో నీటిమట్టాలు పెంచేలా 4,788 పనులకు రూ.28.72 కోట్లు కావాలని అడిగారు.
  • అటవీ శాఖలో 725 చోట్ల రాతి కట్టడాలకు రూ.0.738 కోట్లు, కాంటూరు కందకాలకు రూ.0.707 కోట్లు, కొత్త చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.1.71 కోట్లు, చిన్న ఊట కుంటలు తవ్వేందుకు రూ.0.921 కోట్లు, బంజరు, మెట్ట ప్రాంతాల్లో 1,576 హెక్టార్లలో మొక్కల పెంపకానికి రూ.7.52 కోట్లు ఇవ్వాలని అభ్యర్థించారు.

జల సంరక్షణ పనులు చేపడుతున్న శ్రమజీవులు

  • నగర పంచాయతీలు, పురపాలికలు, నగర పాలికల్లో భవనాలపై కురిసే వాననీటిని భూమిలోకి ఇంకించేందుకు 314 పనులకు రూ.1.88 కోట్లు, రహదారులకు ఇరువైపులా 18 కి.మీ మొక్కలు పెంచేందుకు రూ.0.64 కోట్లు ఇవ్వాలని అడిగారు.
  • గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో ఉన్న జిల్లా యాజమాన్య సంస్థ (డ్వామా) పరిధిలో ఈసారి వాగులు, వంకలపై నూతనంగా 468 చెక్‌డ్యాంలను చేపట్టడానికి రూ.14.16 కోట్లు, 159 చోట్ల కాంటూరు కందకాలు తవ్వడానికి రూ.3.29 కోట్లు, 257 మంచినీటి చెరువుల్లో పూడికతీతకు రూ.5.58 కోట్లు, 75 రజకుల కుంటల్లో పూడిక తీయడానికి రూ.1.24 కోట్లు, పంట కుంటలు 25,290 తవ్వడానికి రూ.541.64 కోట్లు, 11,749 కోనేటి కుంటల నిర్మాణం కోసం రూ.232.60 కోట్లు, 139 చిన్న చెరువులు ఏర్పాటుకు రూ.7.77 కోట్లు, నూతన పశువుల కుంటల నిర్మాణం, పూడికతీతకు రూ.36.22 కోట్లు, వాటర్‌షెడ్‌ ప్రాంతాల్లో ఖండిత కందకాలు తవ్వడానికి రూ.209.13 కోట్లు, కొండ దిగువన కందకాలకు రూ.22.31 కోట్లు, చేపల చెరువులకు రూ.27.33 కోట్లు, రైల్వేమార్గం పక్కనే సరిహద్దుల ఏర్పాటుకు రూ.6.32 కోట్లు, వృథా భూముల పక్కనే సరిహద్దు కందకాలకు రూ.12.78 కోట్లు, వరద కట్లకు రూ.10.60 కోట్లు, ఉద్యాన పంటలు 10 వేల ఎకరాల్లో సాగు చేయడానికి రూ.180 కోట్లు, రహదారులకు ఇరువైపులా 1500 కి.మీ మేర మొక్కల పెంపకం చేపట్టడానికి రూ.55.50 కోట్లు ఇవ్వాలని నివేదించారు. డ్వామా పరిధిలో 30 రకాలైన మొత్తం 68,561 పనులు చేయడానికి రూ.1,518.68 కోట్లు కావాలని అంచనా వేశారు. ఆయా ప్రభుత్వ శాఖల నిధులతో పాటు ఉపాధి పద్దులో ఖర్చు చేయాలని నిర్ణయించారు.

తొలి విడతలో 13 మండలాల్లో..

జిల్లాలో తొలి విడతలో 2019- 20 సంవత్సరంలో 13 మండలాల్లో జలశక్తి అభియాన్‌ పనులను అమలు చేశారు. మంచి ఫలితాలు వచ్చాయి. క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ చేయడంతో భూగర్భంలో నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయి. మొదటి విడతలో చిన్నమండెం, కమలాపురం, రైల్వేకోడూరు, లింగాల, ఓబులవారిపల్లె, పెనగలూరు, పోరుమామిళ్ల, పుల్లంపేట, రాజంపేట, సంబేపల్లె, సింహాద్రిపురం, వేంపల్లె, వేముల మండలాల్లో అమలు చేశారు. అక్కడ విజయవంతంగా పూర్తి చేశారు. ఆ స్ఫూర్తితో ఈసారి అన్ని మండలాల్లో జల సంరక్షణ పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.

జల సంరక్షణకు పెద్దపీట

జిల్లాలో జల సంరక్షణ పనులకు పెద్దపీట వేయాలని నిర్ణయించాం. జలశక్తి అభియాన్‌ కింద 2019-20లో 13 మండలాల్లో అమలు చేశాం. భూగర్భ జలాలు బాగా వృద్ధి చెందాయి. మంచి ఫలితాలు వచ్చాయి. ఈసారి అన్ని మండలాల్లో పనులు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం. జిల్లా కలెక్టరు సి.హరికిరణ్‌ ప్రత్యేక చొరవ తీసుకొని పనులను చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు ఏ శాఖ పరిధిలో ఏ మండలంలో ఎలాంటి పనులు చేయాలో క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించాం. ఈసారి కూడా బాగా పనిచేసి జిల్లాకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాం. - పి.యదుభూషణరెడ్డి, జిల్లా పథక సంచాలకులు, నీటియాజమాన్య సంస్థ, కడప

ఇదీ చూడండి:

ఆ పసి మనసుకేం తెలుసు..? అమ్మలేదని.. తిరిగి రాదని..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.