ETV Bharat / state

గుర్రపు స్వారీ.. కరోనా లాక్​డౌన్​ పట్టింపులేని సవారీ!

లాక్​డౌన్​ ఉంది. బయటకు రావొద్దు. ఒకే కుటుంబం అయినా భౌతిక దూరం మరవొద్దని అధికారుల, నేతలు, పోలీసులు మొత్తుకొని మరీ చెప్తున్నారు. అయినా ఆ రాజకీయ నేతకు పట్టలేదు. గుర్రంపై దర్జాగా విహరించారు. అక్కడితో ఆగక... సోషల్​ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.

ignoring the lockdown and Akepati Srinivasula Reddy Riding a horse at akepadu in kadapa district

author img

By

Published : Apr 22, 2020, 7:17 PM IST

గుర్రపు స్వారీ.. కరోనా పట్టింపులేని సవారీ!

కడప జిల్లా రాజంపేట మండలం ఆకేపాడు గ్రామీణ ప్రాంతంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి... తన అన్న కుమారులతో కలిసి గుర్రం స్వారీ చేశారు. కరోనా లాక్​డౌన్ నేపథ్యంలో అన్న కుమారులతో కలిసి గుర్రపు స్వారీ చేశానంటూ సామాజిక మాధ్యమంలో పోస్ట్​ చేశారు. కరోనా కారణంగా ఎక్కడికీ కదలకుండా ఇంటి పట్టున ఉన్న పిల్లలతో కలిసి ఇలా తోటకు వెళ్ళామని తెలిపారు.

చిన్నతనం నుంచి తమ కుటుంబాల్లో గుర్రాలు ఉండేవని.. తమ కుటుంబ పెద్దలు గుర్రాల పైనే గ్రామాల్లో తిరిగే వారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాము కూడా గుర్రాలను పెంచుతూ వాటిపైనే అప్పుడప్పుడు ఇలా తోటకు వెళ్తుంటామని చెప్పుకొచ్చారు. కానీ... కరోనా సమయంలో ఇలా చేయడం తప్పని మరిచారు.

ఇదీ చదవండి:

ఏనుగులతో వేగేదెట్ల?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.