కడప జిల్లా కోడూరు మండలం రెడ్డివారి పల్లిలో.. పేదలకు అధికారులు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 5,348 మందికి వీటిని అందజేస్తున్నట్లు తెలిపారు. నవరత్నాలలో భాగంగా సీఎం జగన్ ఆదేశాల మేరకు.. స్థలాల పంపిణీతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.
ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు స్థానిక వైకాపా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: