ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రభుత్వంపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆయన వ్యవహారశైలి చూస్తుంటే.. ప్రజాస్వామ్యవాదులకు విసుగుపుట్టే విధంగా ఉందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహ నిర్బంధం చేసే విధంగా నిమ్మగడ్డ ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఆయన ఆదేశాలను ఎవరూ పాటించరన్న సజ్జల.. దానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే.. వాటిని నిలుపుదల చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌కు అధికారులు భయపడకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని సజ్జల విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు