కడప జిల్లా తాళ్ల పొద్దుటూరు గ్రామంలో గండికోట జలాశయ నిర్వాసితుల ఆందోళన 13వ రోజుకు చేరుకుంది. కరోనా కారణంగా పోలీసులు ఆంక్షలు విధించడంతో స్థానిక ప్రైవేటు పాఠశాలలో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు. ముంపు బాధితులందరికీ పరిహారమిచ్చి, ఇళ్ల నిర్మాణానికి గడువు ఇవ్వాలని బాధితులు కోరారు.
స్థానిక సీపీఐ నాయకులు నిర్వాసితుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 12.6 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయం పరిధిలోని పలు కాలనీలు జలమయమయ్యాయి.
ఇదీచదవండి