ఆశ కార్యకర్తలకు కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని ఐఎఫ్టీయూ కడప జిల్లా కన్వీనర్ రాము డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. చేతిలో ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆశా కార్యకర్తలకు ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలిపారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల నుంచి రక్షించాలన్నారు. అధిక పని భారం తగ్గించాలని... యూనిఫాం మంజూరు చేయాలని తెలిపారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: