ETV Bharat / state

ఎద్దులు మెరిసె - యజమాని మురిసె - BULLOCK CART RACE IN AP

తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు

State Level Bullock Cart Competitions in Vadisaleru
State Level Bullock Cart Competitions in Vadisaleru (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2024, 9:27 AM IST

State Level Bullock Cart Race 2024 : తూర్పుగోదావరి జిల్లా ఏడీబీ రోడ్డులోని రంగంపేట-వడిశలేరు మధ్య ఆదివారం రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. ఇవి హోరాహోరీగా సాగాయి. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వచ్చిన 63 ఎడ్ల జతలకు 1,600 మీటర్లు (సీనియర్స్), 1000 మీటర్లు (జూనియర్స్) విభాగాలుగా పరుగు పోటీలు నిర్వహించారు. గన్ని సత్యనారాయణమూర్తి 6వ వర్ధంతిని పురస్కరించుకుని జీఎస్‌ఎల్‌ ఆసుపత్రి ఛైర్మన్‌ గన్ని భాస్కరరావు వీటిని ఏర్పాటు చేశారు. మంత్రి కందుల దుర్గేష్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎన్‌.చినరాజప్ప పోటీలను ప్రారంభించారు.

State Level Bullock Cart Race 2024
సీనియర్స్ విభాగంలో విజేతకు ద్విచక్ర వాహనాన్ని అందజేస్తున్న డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు (ETV Bharat)

సీనియర్స్ విభాగంలో ప్రథమస్థానంలో కోరా శృతి చౌదరి (గుమ్మిలేరు, డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా), ద్వితీయ స్థానంలో శ్రీఆంజనేయం (కె.జి.పురం, అనకాపల్లి జిల్లా), తృతీయ స్థానంలో కోరా శృతి చౌదరి (గుమ్మిలేరు, డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా) నిలిచారు. విజేతలకు బహుమతులుగా ద్విచక్ర వాహనాలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, రుడా మాజీ ఛైర్మన్‌ గన్ని కృష్ణ అందజేశారు.

జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానంలో వేగుళ్ల కృష్ణమాధవి (మండపేట, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా), ద్వితీయ స్థానంలో కోరా శృతి చౌదరి (గుమ్మిలేరు, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా), తృతీయ స్థానంలో ఛాముండేశ్వరి సీఫుడ్స్‌ (గంగపట్నం, నెల్లూరు జిల్లా) కైవసం చేసుకున్నారు. వారికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గన్ని భాస్కరరావు చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు హాజరయ్యారు.

ప్రత్తిపాడులో రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీలు

భీమిలి ఉత్సవాల్లో ఘనంగా ఎడ్లబండ్ల పోటీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.