SPECIAL TRAINS TO KUMBH MELA: ఈ నెల 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా జరగనుంది. ప్రయాణికులు అసౌకర్యానికి గురి కాకుండా రద్దీని దృష్టిలో ఉంచుకుని కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారి కోసం అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించింది. ఏపీలోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్, తెలంగాణలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి.
తిరుపతి టు బెనారస్ (07107) ప్రత్యేక రైలు జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో శనివారం రాత్రి 8.55 గంటలకు తిరుపతిలో బయలుదేరి సోమవారం మధ్యాహ్నానికి అంటే 3.45 గంటలకు బెనారస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07108 నంబరు రైలు జనవరి 20, ఫిబ్రవరి 10, 17, 24 తేదీల్లో బెనారస్‌లో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరుతుంది.
ఈ రైళ్లు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగుడ తదితర స్టేషన్లలో ఆగనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే నర్సాపూర్-బెనారస్ (07109) ప్రత్యేక రైలు జనవరి 26, ఫిబ్రవరి 2 తేదీల్లో నర్సాపూర్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3.45 గంటలకు బెనారస్ చేరుకుంటుంది. మళ్లీ తిరుగు ప్రయాణానికి గాను జనవరి 27, ఫిబ్రవరి 3 తేదీల్లో 07110 నంబరు రైలు బెనారస్‌లో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
Special trains to sabarimala: శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆ తేదీల్లో ప్రత్యేక రైళ్లు
Indian Railways serving Meals at Rs 20 : రైల్వే ప్రయాణికులకు.. రూ.20కే భోజనం..!