వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్‌కు నార్కో అనాలసిస్ పరీక్ష చేసేందుకు సీబీఐ అధికారులు వేసిన పిటిషన్‌ను బుధవారం జమ్మలమడుగు కోర్టు డిస్మిస్ చేసింది. వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు నార్కో అనాలసిస్ పరీక్ష చేసేందుకు సీబీఐ అధికారులు గతంలో పిటిషన్ వేశారు. ఆగస్టు 18వ తేదీన జమ్మలమడుగు కోర్టులో వాదనలు జరగ్గా, అదే నెల 27వ తేదీకి వాయిదా వేశారు. 27వ తేదీ జూమ్ యాప్ ద్వారా జరిగిన వాదనల అనంతరం మరోమారు సెప్టెంబరు ఒకటో తేదీకి వాయిదా వేశారు. బుధవారం ఉదయం 10.50 గంటలకు సీబీఐ అధికారులు ముగ్గురు జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 1.15 గంటల వరకు జూమ్ యాప్ ద్వారా ఇరువురు వాదనలు వినిపించారు. ‘‘నార్కో అనాలసిస్ పరీక్ష చేయించుకునేందుకు మీరు సమ్మతిస్తున్నారా?’’ అని సునీల్ యాదవ్‌ను జడ్జి షేక్ బాబా ఫకృద్దీన్ అడగగా అందుకు ఆయన నిరాకరించారు. నార్కో పరీక్షలకు సునీల్ అంగీకరించకపోవడంతో సీబీఐ వేసిన పిటిషన్‌ను కొట్టి వేశారు. సునీల్ యాదవ్‌కు ఈ నెల 15వ వరకు రిమాండును పొడిగించారు.
ముగ్గురిని విచారించిన సీబీఐ
కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో బుధవారం సీబీఐ విచారణ కొనసాగింది. అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన ముగ్గురిని సీబీఐ అధికారులు విచారించారు.
ఇదీ చదవండి
CM JAGAN: గ్రామ సచివాలయాల్లో 2,038 పోస్టుల భర్తీకి సీఎం జగన్ అంగీకారం