ETV Bharat / state

కరోనా కాటు... రైతు కంట కన్నీరు - రైతులపై కరోనా ప్రభావం

కరోనా వైరస్ దెబ్బ రైతన్నపై గట్టిగానే పడింది. కోతకొచ్చే సమయంలో లాక్‌డౌన్ విధించడంతో... అమ్మకాలు కష్టంగా మారాయి. పంటల్ని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకునే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అదే సమయంలో చేసేందుకు పనుల్లేక కూలీలు అవస్థలు పడుతున్నారు.

corona effect on ap farmers
కరోనా కాటు... రైతు కంట కన్నీరు
author img

By

Published : Apr 5, 2020, 5:32 AM IST

కరోనా ప్రభావంతో మామిడి రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కోతకు వచ్చిన మామిడిని ఏంచేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతం నుంచి దేశంలోని పలు రాష్ట్రాలకు మామిడి ఎగుమతి అవుతుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆయా ప్రాంతాలకు మామిడి తరలించే వీల్లేకుండా పోయింది. ప్రస్తుతం కాయలు కోసేందుకు కూలీలు, తరలించేందుకు లారీలు అందుబాటులో లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే మామిడిని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటే తమకు మేలు కలుగుతుందని రైతులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో కూలీలు సైతం మామిడికోతలకు ముందుకు రావడం లేదు.

ఉద్యానం మట్టిలోకే...

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఉద్యాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. లక్షల పెట్టుబడితో సాగు చేసిన కర్బూజ, కళింగర, అరటి పంటలు కొనటానికి వ్యాపారులు ముందుకు రాకపోవటంలేదు. రైతులే పొరుగు రాష్ట్రాల్లోని మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయించుకోవాలన్నా రవాణా ఆంక్షలతోపాటు, ఎక్కడా మార్కెట్లలో వ్యాపారం జరగటంలేదు. గత్యంతరం లేని పరిస్థితిలో తోటలోనే కుళ్లిపోయిన పళ్లను మట్టిలో కలిపేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆశించిన స్థాయిలో పంట వస్తుందనే నమ్మకంతో లక్షల రూపాయల పెట్టుబడి పెట్టామని... ఇప్పుడు తమకు అప్పులే మిగిలాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

వరిని వంగదీసింది..

కడప జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాధి కారణంగా కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రబీలో ఎక్కువగా వరి సాగు చేస్తారు . ప్రస్తుతం పంట కోతకు వచ్చింది. జిల్లాలో తగినన్ని కోత యంత్రాలు లేకపోవడం వల్ల... వరిపంట నేల వాలిపోతుంది. కోత యంత్రాలను రైతులు గంటకు 16,00 చెల్లించి అద్దెకు తీసుకునే వారు. ఇప్పుడు 2,000 రూపాయలు చెల్లిస్తామన్నా ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు దిగాలు పడుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వెయ్యి ఎకరాల్లో వరి పంట కోతకు వచ్చింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు

మిర్చీకి మంటపెట్టింది..

కరోనా వైరస్‌ ప్రభావంతో రైతులు, కూలీలు విలవిల్లాడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా గుంటూరులో మిర్చికూలీలు అవస్థలు పడుతున్నారు. మిర్చియార్డు మూసివేయడం సహా తొడిమలు తీసే ప్రక్రియ నిలిచి వేలాదిమంది ఉపాధికి గండిపడింది. ఈ పనులకు గుంటూరు, ప్రకాశం జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర, ఒడిశా, బిహార్ రాష్ట్రాల నుంచి కూలీలు పెద్దఎత్తున తరలివస్తారు. కరోనా మూలంగా ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా మారింది. వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం మిర్చియార్డును తాత్కాలికంగా నిలిపి వేయడంతో కొనుగోళ్లు, అమ్మకాలు ఆగిపోయాయి. విదేశాలకు రవాణా సైతం స్తంభించింది. ఫలితంగా దీనిపైనే ఆధారపడిన కూలీల పరిస్థితి దయనీయంగా మారింది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 192 కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.