కేంద్రం వంటగ్యాస్ సిలిండర్ ధర పెంచడం గర్హనీయమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. గతేడాది డిసెంబర్లో రూ.50 పెంచి.. రెండు నెలలు గడవక ముందే రూ.25 పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలు సెంచరీలు కొట్టబోతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెంపుతో ప్రజలపై భారం మోపుతున్నారని తులసి రెడ్డి అన్నారు. కరోనా ప్రభావంతో ఆదాయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వంటగ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఈ-వాచ్ యాప్ వాడకంలోకి తేవద్దు: హైకోర్టు