కడప జిల్లాకు ఓ మైనార్టీ కుటుంబం.. సోషల్ మీడియాలో పెట్టిన సెల్ఫీ వీడియోపై(selfie video) సీఎం జగన్(cm jagan) స్పందించారు. ఈ విషయంపై కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌తో మాట్లాడారు. ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. వారంలో సమస్య పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్‌కు.. సీఎం ఆదేశాలు జారీ చేశారు. మైదుకూరు గ్రామీణ సీఐ వ్యవహారంపై విచారణ జరిపి.. వారంలోగా చర్యలు తీసుకోవాలన్నారు. భూమికి సంబంధించి వారంలో విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
అసలేం జరిగింది..
కడప జిల్లా దువ్వూరు మండలానికి చెందిన ఓ వైకాపా నాయకుడు.. తమ కుటుంబానికి చెందిన 1.5 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ..అక్బర్ బాషా జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ సూచన మేరకు మైదుకూరు రూరల్ సీఐకి తమ సమస్యను వివరించారు. తన సమస్యను పరిష్కరించకుండా వైకాపా నేతకు అనుకూలంగా సీఐ వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రూపొందించారు. సీఐ కొండారెడ్డి, వైకాపా నాయకుడి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కన్నీటిపర్యంతమయ్యారు. తన సమస్యపై సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
సంబంధిత కథనం: