ETV Bharat / state

ఈ పురుగులు పట్టాయో.. ఆకులు మాయం!

పదుల సంఖ్యలో కాకుండా వేల సంఖ్యలో దారపు పురుగులు ఒకే చెట్టుపై దట్టంగా ఉండి ఆకులను తింటున్నాయి. ఇలా తేనెటీగలు మాత్రమే గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. 2010 - 11 సంవత్సరంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో  ఉద్ధృతంగా కనిపించిన ఈ పురుగులు.. ఇన్నేళ్ల తర్వాత కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో దర్శనమిచ్చాయి. వేప, టేకు, తేయాకు ఆకులను తింటూ ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎక్కడ పంటలమీదకి వస్తాయోనని రైతులు కంగారు పడుతున్నారు.

Cleora cornaria  eats neem plants  at railway koduru
రైల్వే కోడూరులో దారపు పురుగులు
author img

By

Published : Jul 4, 2021, 5:52 PM IST

రైల్వే కోడూరులో దారపు పురుగులు

దూరం నుంచి వీటిని చూస్తే అచ్చం మిర్చి లాగే కనిపిస్తాయి. కానీ.. దగ్గరికి వెళ్లి చూస్తేనే తెలుస్తుంది అవి మిరపకాయలు కాదు... దారపు పురుగులు అని. ఇవి గుంపులు గుంపులుగా ఉంటూ ఆకులన్నీ తింటూ.. చెట్లను మోడు బారేలా చేస్తున్నాయి. ఔషధ గుణాలున్న వేప చెట్లకు సైతం దారపు పురుగులు ఆశిస్తున్నాయి. ఈ పురుగులను కడపజిల్లా రైల్వే కోడూర్ నియోజకవర్గంలోని రైతులు మే మొదటి వారం నుంచి గమనిస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలకు స్థానిక రైతులు ఫిర్యాదులు చేయడంతో.. వారు చుట్టుపక్కల ఉండే వేప చెట్లను పరిశీలించారు. ఈ పురుగల పేరు క్లియోరా కార్నారియా. వేలసంఖ్యలో వేప చెట్లను ఈ పురుగులు ఆశించి.. చెట్లకు ఆకులు లేకుండా తినేస్తున్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్ శారద, నళినిలు నియోజకవర్గ పరిధిలోని పంటపొలాలు, వేప, టేకుతో పాటు కలుపు మొక్కలను ఆశించి వాటి ఆకులను తింటున్నట్లు గమనించారు.

పదేళ్లకు ముందు పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో...

సాధారణంగా వేసవి సమయంలో వర్షాలు పడినపుడు అక్కడక్కడా వేప చెట్లను ఆశించడం గమనించినట్లు వారు తెలిపారు. ఈ విధంగా ఉద్ధృతంగా వేప చెట్లను ఆశించి పూర్తిగా ఆకులను తినడం చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో 2010-11 సంవత్సరంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గమనించారని.. అయితే అవి ఇప్పుడు రైల్వేకోడూరు నియోజకవర్గంలో అలానే కనిపిస్తున్నాయని తెలిపారు.

రెక్కల ఈగలే.. దారపు పురుగులుగా మారి..

రెక్కల ఈగలు వేప చెట్ల ఆకులపై పెట్టిన గుడ్ల నుంచి లార్వాలు బయటికి వచ్చి పది పదిహేను రోజులు చెట్లపై ఉండి ఆకులను తింటాయని వారు అన్నారు. అనంతరం దారాలు వదులుతూ చెట్ల పైనుంచి కిందికి వచ్చి.. కోశస్థ దశకు చేరుకుని భూమిలోకి వెళతాయని తెలిపారు. 10, 13 రోజుల వ్యవధిలో రెక్కల పురుగులుగా మారి..మరల చెట్లపై వాలి గుడ్లు పెడతాయని తెలిపారు. ఈ విధంగా వాటి సంఖ్య పెరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

పంట పొలాల్లోకి వచ్చి నష్టం కలిగించక ముందే వాటి నివారణ చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. ఇప్పటివరకు వేప చెట్లు, టేకు చెట్లను ఆశించడం మాత్రమే గమనించామని ఇతర పంటలపై వాటి ప్రభావం లేదని గుర్తించామన్నారు. ముందు ముందు వాటి ఉద్ధృతి ఎక్కువై ఆహారం కోసం ఇతర పంటలపై వచ్చే అవకాశాలు ఉన్నాయో..లేవో పరిశీలిస్తామని అన్నారు. రైతులు దారపు పురుగులను గమనించిన వెంటనే వాటిని నాశనం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

కాంతి ఎరల ఏర్పాటు

రాత్రి వేళల్లో కాంతి ఎరలను ఏర్పాటు చేయడం వలన వాటిని నశింపజేయవచ్చని తెలిపారు. కోశస్థ దశలో ఉన్నప్పుడు అవి ఉన్న ప్రాంతాల్లో భూమిని దున్నడం వలన ఎండ వేడికి అవి చనిపోతాయని అన్నారు.

రసాయన మందుల వినియోగం

పురుగులు ఎక్కువగా ఉన్నచోట మోనోక్రోఠోఫాస్ లేదా 1.5 మీ.లీ సైపెర్ మిత్రిన్ లేదా 1 మీ.లీ డెల్టా మిత్రిన్ మందులను ఒక లీటరు నీటికి కలిపి వేపచెట్టు మొదలులో పిచికారీ చేస్తే పురుగు లార్వాలు నశిస్తాయని తెలిపారు. రైతులు ఇవి గమనించి లార్వా దశలో ఉన్నప్పుడే వాటిని నాశనం చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాతావరణ మార్పుల వల్లే వాటి ఉద్ధృతి ఎక్కువగా వ్యాపిస్తుందని తెలిపారు.

ఇదీ చూడండి:

'బాబాయ్​ పవన్ కల్యాణ్​ను చూడాలని ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.