ETV Bharat / state

600 మందికి ఆహారం అందించిన ఆర్యవైశ్య సంఘం - CARONA HELPING HANDS

కడప జిల్లా రాయచోటిలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు రోజు ఉదయం 600 మందికి స్వల్ప ఆహారం అందిస్తున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా ఆహారాన్ని పేదలకు అందించారు.

KADAPA DISTRICT
రాయచోటిలో 600 మందికి స్వల్ప ఆహారం అందిస్తున్న ఆర్యవైశ్య సంఘం
author img

By

Published : Apr 25, 2020, 9:53 AM IST

లాక్​డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి బాధలు తీర్చేందుకు దాతలు దాతృత్వం చాటుకుంటున్నారు. కొందరు భోజనాలు సమకూర్చగా మరికొందరు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మజ్జిగ, ఇతర పానీయాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

కడప జిల్లా రాయచోటిలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు రోజు ఉదయం 600 మందికి స్వల్ప ఆహారం అందిస్తున్నారు. గాంధీ బజార్​లోని ఆర్యవైశ్య సమాజంలో వంటకాలు చేసి యువకుల ద్వారా పట్టణంలో విధుల్లో ఉన్న పోలీసులు, పురపాలక, రెవెన్యూ, పారిశుద్ధ్య కార్మికులు, వలస కూలీలకు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా స్వల్ప ఆహారాన్ని పేదలకు అందించారు. విపత్కర పరిస్థితుల్లో పేదల ఆకలి బాధలు తీర్చటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.