ETV Bharat / state

నేవీ విన్యాసాలు అద్భుతం - ముంబై తరహాలో ఏపీకి విశాఖ ఆర్థిక రాజధాని : సీఎం చంద్రబాబు - CHANDRABABU AT NAVY CELEBRATIONS

రాష్ట్రాభివృద్ధికి నౌకాదళం సహకరించాలన్న సీఎం - ప్రస్తుతం ఉన్న వివిధ ప్రాజెక్టులు పూర్తయితే విశాఖ మారిటైం గేట్‌వేగా నిలుస్తుందని వెల్లడి

CM Chandrababu naidu To Attend Navy Day Celebrations in Visakha
CM Chandrababu naidu To Attend Navy Day Celebrations in Visakha (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2025, 8:22 AM IST

CM Chandrababu naidu To Attend Navy Day Celebrations in Visakha : "దేశం ఆర్థికంగానే కాకుండా రక్షణ రంగంలోనూ బలంగా ఉండాలి. అందుకే ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌లో భాగంగా రక్షణ రంగానికి పెద్దపీట వేశారు. అలాంటి రక్షణరంగంలో నౌకాళం చేస్తున్న కృషి అసామాన్యం. నేవీని చూసి వేరే దేశాలు భయపడేలా పనిచేస్తున్నారు. సముద్ర రవాణాకు తూర్పునౌకాదళం రక్షణగా నిలిచి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తోంది. దేశ రక్షణకే కాదు ఏదైనా విపత్తు వచ్చినా నౌకాదళం వేగంగా స్పందిస్తోంది. హుద్‌హుద్‌ తుపాను సమయంలో పది రోజుల పాటు నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. తుపాన్ల సమయంలో మత్స్యకారుల ప్రాణాలు కాపాడుతున్నారు" అని చంద్రబాబు పేర్కొన్నారు.

"సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులు కల్పించుకుంటే ఆర్థికంగా ఎదగొచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి తరహాలో విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం. ప్రస్తుతం ఉన్న పోర్టులు, భోగాపురం ఎయిర్‌పోర్టు, మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తయితే మారిటైం గేట్‌వేగా విశాఖ నిలుస్తుంది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పు నౌకాదళం విశాఖ తీరంలో శనివారం నిర్వహించిన విన్యాసాల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకుర్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. తూర్పు నౌకాదళాధిపతి రాజేష్‌ పెంథార్కర్‌ ముఖ్యమంత్రిని సభావేదిక పైకి తోడ్కొని వెళ్లారు.

టెక్నాలజీలో ఏపీ ముందంజ : దేశ భవిష్యత్తు, రక్షణకు నౌకాదళం ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందో, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా అదే తరహాలో సహకరించాలని తూర్పు నౌకాదళాన్ని సీఎం కోరారు. సముద్ర ఆర్థికవ్యవస్థలో వెనుకంజలో ఉన్నామని ఆ రంగంలో బలోపేతానికి నేవీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సలహాలివ్వాలన్నారు. డ్రోన్‌ టెక్నాలజీ, డీప్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ఏపీ ముందంజలో ఉందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంటును పరిరక్షించుకునే దిశగా సాగుతున్నామని, టెక్నాలజీ, ఫార్మా, ఔషధ తయారీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దడానికి ముందుకెళుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

వచ్చే ఏడాది విశాఖకు గోదావరి నీళ్లు

‘విశాఖలో భారీ పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం గూగుల్‌తో ఒప్పందం చేసుకుంది. టీసీఎస్‌ ముందుకొచ్చింది. ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఈ నెల 8న ప్రధాని రైల్వే జోన్, ఎన్టీపీసీ, జెన్‌కో సంయుక్తంగా గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. గోదావరి నీళ్లు ఈ ఏడాది అనకాపల్లికి వస్తాయి. రాబోయే సంవత్సరం విశాఖకు తెస్తాం. విశాఖను నాలెడ్జ్, టూరిజం హబ్‌గా తయారుచేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కురుసుర సబ్‌మెరైన్‌ మ్యూజియం, టీయూ-142 ఎయిర్‌క్రాఫ్ట్‌ మ్యూజియం ఇవన్నీ తెలుగుదేశం హయాంలోనే విశాఖకు వచ్చాయని గుర్తుచేశారు.

సతీమణి, మనవడితో కలిసి విన్యాసాలు తిలకించి : శనివారం సాయంత్రం విశాఖ తీరంలో నిర్వహించిన నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాంశ్‌లతో కలిసి వాటిని తిలకించారు. నౌకాదళ విన్యాసాలను ఆయన మనవడికి వివరించారు. రాజేష్‌ థామి నేతృత్వంలో ఐఎన్‌ఎస్‌ కర్ణలో శిక్షణ పొందిన నౌకాదళ సిబ్బంది 8 వేల అడుగుల ఎత్తులో పారాచూట్లతో విన్యాసాలు చేశారు. నేవీ స్మారక చిహ్నంతో పారాచూట్‌ నుంచి నేరుగా సభాప్రాంగణం ముందు దిగి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు జ్ఞాపిక అందజేశారు. కమాండోల ధైర్య సాహసాలను సీఎం కొనియాడారు.

పెట్టుబడి కంటే ఐడియా ముఖ్యం - తెలుగువాళ్లు ఉన్నత స్థానాలకు ఎదగాలి: చంద్రబాబు

విశాఖ, విజయవాడలో మెట్రో ప్రాజెక్టులు -25 కి.మీ మేర డబుల్ డెక్కర్ విధానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.