ETV Bharat / state

భూ యజమాని బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్‌ - 6 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ - LAND ILLEGAL REGISTRATION

నకిలీ ధ్రువపత్రాలతో భూముల కబ్జాకు నిందితుల పన్నాగం - సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు మరో ఐదుగురిపై కేసులు - సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చిన మంత్రి అనగాని

fake_report_and_land_illegal_registration_in_kurnool_district
fake_report_and_land_illegal_registration_in_kurnool_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2025, 8:05 AM IST

Updated : Jan 5, 2025, 8:52 AM IST

Fake Report and Land Illegal Registration In Kurnool District : భూములు కాజేసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు అక్రమార్కులు. నకిలీ పత్రాలను అవలీలగా సృష్టిస్తూ ఆస్తులు కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇలాంటి కుట్రే శనివారం వెలుగుచూసింది. భూమి యజమాని ఈశ్వరప్ప 2009లో చనిపోయినట్లు నిందితులు నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు సృష్టించారు. ఈశ్వరప్పకు చెందిన 6 ఎకరాల 51 సెంట్ల భూమిని గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడుకు చెందిన చాకలి ఈరన్న పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఈ విషయాన్ని ఆన్‌లైన్‌లో గుర్తించిన ఈశ్వరప్ప కుమారుడు మోహన్‌ సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం సిబ్బందిని నిలదీయగా అసలు విషయం వెలుగుచూసింది. న్యాయం చేయాలంటూ బాధితుడు ఈశ్వరప్ప, కుమారులు సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు సబ్‌ రిజిస్ట్రార్‌తోపాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదోని సబ్‌ రిజిస్ట్రార్‌ అవినీతి వ్యవహారంపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్, స్టాంప్స్‌ ఐజీ సహా ఇతర అధికారులతో చర్చించిన మంత్రి తక్షణం ఆదోని సబ్ రిజిస్ట్రార్‌తోపాటు అవినీతికి పాల్పడిన మిగిలిన ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చారు.

'మా నాయన బతికి ఉండగానే 23-06-2009 లో చనిపోయినట్టు అప్పటి పంచాయతి సెక్రటరీ సర్టిఫికెట్​ ఇచ్చారు. తహసీల్దార్​​ ఫ్యామిలీ సర్టిఫికెట్​ ఇచ్చారు. అందులో భార్య పేరు కూడా లేదు. సబ్​రిజిస్టర్​కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. మా 6 ఎకరాల 51 సెంట్ల భూమి మాకు దక్కేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నాం.' - మోహన్​ ఈశ్వరప్ప కుమారుడు

భూ యజమాని బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్‌ - 6 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ (ETV Bharat)

ఫ్రీహోల్డ్‌ పేరుతో 1.26 లక్షల ఎకరాల్లో వైఎస్సార్సీపీ నేతల అక్రమాలు

రైతుల వద్ద లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారి - బయటపడ్డ ఫోన్‌ రికార్డింగ్​లు

Last Updated : Jan 5, 2025, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.