Revenue Officer Demands Bribe From Farmers To Resolve Land Issues : భూసమస్యల పరిష్కారానికి లంచమివ్వాలంటూ రెవెన్యూ అధికారులు రైతుల్ని పీడిస్తున్న వైనం ప్రకాశం జిల్లా కనిగిరిలో వెలుగుచూసింది. కనిగిరి మండలం పునుగోడు పంచాయతీలో శనివారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతోపాటు MLA ఉగ్రనరసింహారెడ్డి హాజరయ్యారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని భూసమస్యలను కలెక్టర్‌కు అర్జీల రూపంలో అందజేశారు. తహసీల్దారుపై అనేక ఫిర్యాదులు అందాయి. మ్యుటేషన్ కోసం రెండున్నర లక్షలు చెల్లించాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ రైతు ఫిర్యాదు చేశారు.
రెవెన్యూ అధికారి తన కుమారుడితో మాట్లాడిన ఫోన్ రికార్డింగును కలెక్టర్‌కు వినిపించారు. ఈ విషయంపై ఆగ్రహించిన కలెక్టర్ రైతుల అర్జీల స్థితిగతులను వెంటనే చూపించాలని తహసీల్దారు అశోక్‌కుమార్ రెడ్డిని అడగ్గా ఆయన నీళ్లు నమిలారు. రెవెన్యూ సదస్సుల్లో సంబంధింత రెవెన్యూ రికార్డులు లేకుండా ఎలా వస్తారని తహసీల్దారుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సక్రమ నివేదిక ఇవ్వాలని అక్కడే ఉన్న ఆర్డీవోను ఆదేశించారు.
రూ.600 ఇస్తేనే పింఛన్ - మహిళా అధికారి దౌర్జన్యం - కట్ చేస్తే
పైసలిస్తేనే రిజిస్ట్రేషన్ - రైతులను పీల్చి పిప్పి చేస్తున్న సీఆర్డీఏ ఉద్యోగులు