Mastan Sai and Lavanya Drugs Case : యువతుల నగ్న వీడియోలతో బెదిరింపులు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కేటుగాడు రావి మస్తాన్ సాయి కేసులో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. ఈ నెల 3న మస్తాన్‌ను అరెస్టు చేసిన పోలీసులు గత కేసుల తాలూకూ అనుమానంతో అతడి మూత్ర నమూనాలు పరీక్షించగా డ్రగ్స్ పాజిటివ్‌గా తేలడంతో డ్రగ్స్ కోణం బయటపడింది. ఎండీఎంఏ తీసుకున్నట్లు తేలడంతో కొత్తగా ఎన్‌డీపీఎస్ చట్టాన్ని చేర్చారు. మస్తాన్ సాయితో పాటు అతడి స్నేహితుడు, మరో నిందితుడు షేక్ ఖాజా మెయినుద్దీన్(36)కు కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. మస్తాన్‌సాయికి సంబంధించి కొన్ని పార్టీ వీడియోలు వెలుగు చూడడంతో పాటు ఎంతో మంది యువతీయువకులు డ్రగ్స్ లాంటి మత్తుపదార్థాలు తీసుకున్నట్లు కనిపించడం సంచలనం రేపుతోంది. స్వాధీనం చేసుకున్న వీడియోల్లో గంజాయి, డ్రగ్స్, పాపీస్ట్రా వంటివి కొన్ని ఫొటోల్లో కనిపించగా బుధవారం వెలుగులోకొచ్చిన మస్తాన్‌సాయి రిమాండ్ రిపోర్టులోనూ పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించడం విదితమే.
వందకు పైగా మహిళల వీడియోలు - మరోసారి కస్టడీకి మస్తాన్‌సాయి!
రికార్డు చేసి బెదిరింపులు..
గుంటూరు జిల్లాకు చెందిన రవి బావాజి మస్తాన్‌రావు అలియాస్ మస్తాన్ సాయి(33)కి మూడేళ్ల క్రితం లావణ్యతో పరిచయం ఏర్పడగా ఏసారి పార్టీకి పిలిచి మద్యం ఆఫర్ చేశాడు. ఆమె మత్తులోకి వెళ్లాక నగ్న వీడియో రికార్డు చేసి బయటపెడతానని బెదిరించి లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని ఆమె సినీ నటుడు రాజ్‌తరుణ్‌కు చెప్పగా మస్తాన్‌సాయితో మాట్లాడి వీడియోలు డిలీట్ చేయించినట్లు సమాచారం. మరోసారి 2023లో తన సోదరి వివాహానికి రావాలంటూ లావణ్యను పిలిచి మరోసారి లైంగిక దాడికి యత్నించాడని ఆమె ఫిర్యాదు చేయడంతో మస్తాన్ సాయిపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన అతడు ఉద్దేశపూర్వకంగా కేసులో ఆమె పేరును ఇరికించినట్లు తెలుస్తోంది. కాగా, తన స్నేహితురాలు స్వాతిని వేధిస్తున్నావంటూ లావణ్యపై మస్తాన్ సాయి దాడి చేయడంతో నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది.
కేసు విత్‌డ్రా చేసుకోవాలని కోరుతూ గుంటూరులోని తన ఇంటికి రావాలని లావణ్యను పిలిపించాడు. కాగా, పథకం ప్రకారం అక్కడికి వెళ్లిన ఆమె నిందితుడి దగ్గరున్న హార్డ్‌డిస్కును తీసుకుంది. అందులో నగ్న వీడియోలు, మత్తు పార్టీల ఫొటోలు ఉన్నాయి. కాగా, తన హార్డ్‌డిస్కు లావణ్య తీసుకున్నట్లు గుర్తించిన మస్తాన్ సాయి ఈ నెల 2న అర్ధరాత్రి కోకాపేటలోని ఇంటికి వెళ్లి ఆమె గొంతు నొక్కి చంపేందుకు ప్రయత్నించాడు. సోదరుడు, పనిమనిషి సాయంతో బయటపడిన లావణ్య పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని హార్డ్‌డిస్కును అందజేసింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మస్తాన్ సాయి డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడటం ఇది మూడోసారి కాగా, గతంలో మోకిల, ఏపీలోని విజయవాడ సెబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
'నన్ను కొట్టాడు' - 'లేదు నాపైనే దాడి చేసింది' - లావణ్య, శేఖర్ బాషా పరస్పర ఫిర్యాదులు
ఇంద్రధనస్సులో రంగులు సీతాకోక చిలుకలకు ఎలా వచ్చాయి? - ఎంతో ఆసక్తికరం