CM Chandrababu Discussion with Ministers: శాఖల పరంగా మంత్రుల పనితీరు మెరుగుపడాలని అందరు గేరు మార్చాలని సీఎం చంద్రబాబు చంద్రబాబు ఆదేశించారు. మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్ వివరాలను ఆయన మంత్రివర్గం సమావేశం అనంతరం చదివి వినిపించారు. దస్త్రాల క్లియరెన్స్‌లో తాను 6వ స్థానంలో ఉన్నానని చంద్రబాబు తెలిపారు. క్యాబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు కొద్దిసేపు మంత్రులతో మాట్లాడారు. మొదటి 6 నెలలు మంత్రుల పనితీరును అంతగా పట్టించుకోలేదన్న చంద్రబాబు ఇకపై ఎవరినీ ఉపేక్షించనని హెచ్చరించారు. ఆప్కోస్ ద్వారా కాకుండా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఇక శాఖల వారిగా తీసుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు.
విద్యుత్ ఛార్జీలు తగ్గాలి: వివిధ పథకాల అమలుపై చేయిస్తున్న సర్వేల్లో సానుకూల స్పందన ఉందని సీఎం చెప్పారు. దావోస్ పర్యటన ఫలితం సానుకూలంగా ఉందని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగటానికి వీల్లేదని ఆయన తేల్చి చెప్పారు. సమగ్ర పవర్ మేనేజ్మెంట్తో రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు వీలైతే తగ్గాలే తప్ప పెరగటానికి వీల్లేదని తెలిపారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలను వేగవంతం చేసేలా కలెక్టర్లు, ఎస్ఈలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా 7.5లక్షల ఉద్యోగాల హామీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
వేసవి వస్తోంది ఏం చేద్దాం? - రికార్డు స్థాయిలో గ్రిడ్ పీక్ డిమాండ్
ఎన్ని పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయో ఎప్పటికప్పుడు పరిశీలించి అందుకు తగ్గట్టు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలని సీఎం అన్నారు. పాఠశాలల పునప్రారంభంలోనే డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. పోలవరం నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణంపైనా కీలక చర్చ జరిగింది. తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాలు వచ్చే 3 నెలల్లో అమల్లోకి తీసుకొస్తున్నట్లు పునరుద్ఘాటింటారు. నామినేటడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లను కులాల వారీగా సర్దుబాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు.
మద్యం దుకాణాల యజమానులకు కమిషన్ పెంపు: వచ్చే 3 నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రులకు సీఎం సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలక బాధ్యత తీసుకుని ప్రచారం నిర్వహించాలన్నారు. ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. కేంద్రం ఇచ్చే 6 వేలకు రాష్త్రం 14 వేలు కలిపి ఇచ్చే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. కేంద్రంతోపాటు 3 విడతలుగా రాష్ట్రం ఆర్థిక సాయం ఇవ్వాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. మద్యం దుకాణాల యజమానులకు వచ్చే కమిషన్ 10.5 శాతం నుంచి 14 శాతానికి పెంచారు.
ఆదుకోవాలంటూ లోకేశ్‌కు విజ్ఞప్తి - సీఎం సహాయనిధి నుంచి రూ.3 లక్షలు
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ - భవన నిర్మాణాలకు 24 గంటల్లోనే అనుమతులు