ETV Bharat / state

VRO'S UNION ON MINISTER APPALARAJU: మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాలి: వీఆర్వోల సంఘం

author img

By

Published : Dec 1, 2021, 10:53 PM IST

VRO'S STATE PRESIDENT ON MINISTER APPALARAJU: గ్రామ రెవెన్యూ అధికారుల(VRO)పై మున్సిపల్ కమిషనర్, మంత్రి అప్పలరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర వీఆర్వో సంఘం అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి అప్పలరాజు... భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

VRO'S STATE PRESIDENT ON MINISTER APPALARAJU
మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై రాష్ట్ర వీఆర్వో సంఘం ఫైర్

VRO'S STATE PRESIDENT ON MINISTER APPALARAJU: శ్రీకాకుళం జిల్లాలో గ్రామ రెవెన్యూ అధికారుల(VRO)పై రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, మున్సిపల్ కమిషనర్​.. అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వీఆర్వోల సంఘం అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై మున్సిపల్ కమిషనర్, మంత్రి అప్పలరాజు... భేషరతుగా క్షమాపణ చెప్పాలని రవీంద్రరాజు డిమాండ్ చేశారు. 'శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సచివాలయాల నుంచి సర్పంచులు, జడ్పీటీసీలు, వీఆర్వోలను బయటకునెట్టండి అంటూ... మంత్రి సిదిరి అప్పలరాజు చెప్పారు. వీఆర్వోల సేవలు నియోజకవర్గంలో అవసరం లేదని.. వారిని సస్పెండ్ చేయాలని తహసీల్దార్లను మంత్రి ఆదేశించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు' రవీంద్రరాజు ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరుస్తూ... నిత్యం ప్రజలతో కలిసి పనిచేసే తమను సమావేశం నుంచి బయటకు వెళ్లాలని హెచ్చరించడం దారుణమన్నారు. దీనిపై మంత్రి క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని రవీంద్రరాజు హెచ్చరించారు.

ఇదీ చదవండి..

minister appalraju fires on vro's: వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు ఫైర్.. వారి సేవలు అవసరం లేదంటూ ఆగ్రహం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.