తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవంలో భాగంగా శనివారం స్వామివారికి చక్ర స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులు సముద్రంలో స్నానాలు ఆచరించారు. ఈ క్రమంలో బెల్లంకొండ రాజబాబు, పెచ్చెట్టి వరలక్ష్మి అనే భక్తులు.. టేకు చేప కుట్టడంతో అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే స్పందించిన స్థానిక భక్తులు, బంధువులు... వారిని రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ చేప కుడితే 24 గంటలపాటు విపరీతమైన నొప్పి ఉంటుందని.. అయితే ప్రాణాపాయమేమీ ఉండదని స్థానిక మత్స్యకారులు చెప్పారు.
ఇదీ చదవండి: