ETV Bharat / state

పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులతో ఆత్మీయ సమావేశం - తణుకు ఆత్మీయ సమావేశం

తణుకు నియోజకవర్గంలో తెదేపా తరఫున గెలుపొందిన సర్పంచులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తాము అండగా ఉంటామని.. సమావేశంలో పాల్గొన్నవారికి నాయకులు భరోసా కల్పించారు.

tdp supported sarpanches meet in tanuku
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులకు ఆత్మీయ సమావేశం
author img

By

Published : Mar 13, 2021, 5:09 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచుల ఆత్మీయ సమావేశం తణుకులో నిర్వహించారు. మనరాజు ఇండస్ట్రీస్ అధినేత ఆధ్వర్యంలో తెదేపా బలపరచగా గెలుపొందిన వారితో ఈ సమావేశం జరిగింది. సర్పంచులను ఘనంగా సత్కరించారు. ప్రతిపక్షాల అడ్డంకులను, ప్రలోభాలను, బెదిరింపులను దాటి నిలిచారంటూ నాయకులు వారిని అభినందించారు.

తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన వారు భయపడవలసిన అవసరం లేదని రాజు ఇండస్ట్రీస్ అధినేత భరోసానిచ్చారు. ప్రజలు మెచ్చుకునేలా సేవలు అందించాలని సర్పంచులను కోరారు. ఒక్క అవకాశం కోరినందుకు.. నమ్మకంతో గెలిపించారని అన్నారు. గెలిచిన సర్పంచులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

వైభవంగా భీమవరం సోమేశ్వరస్వామి రథోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.