అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్వాధీనం - Seizure of ration rice in Chakrayagudem
పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం చక్రాయగూడెంలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం నిల్వ ఉంచిన సుబ్రమణ్యం అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం చక్రాయగూడెంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోదాములో రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడిచేశారు. 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచిన సుబ్రమణ్యం అనే వ్యక్తిపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం కొనుగోలు చేసి.. ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నాడని విజిలెన్స్ అధికారులు తెలిపారు. జిల్లాలో రేషన్ బియ్యాన్ని కొనుగులు చేసి.. కోళ్లదాణాకు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల దర్యాప్తులో వెళ్లడైందని అధికారులు తెలిపారు.