ETV Bharat / state

నితీష్ మరెన్నో సెంచరీలు సాధించి విజయాన్ని కొనసాగించాలి: చంద్రబాబు - NITISH KUMAR MET CM CHANDRABABU

సీఎం చంద్రబాబును కలిసిన క్రికెటర్​ నితీష్​ కుమార్​ రెడ్డి - సీఎం చేతుల మీదుగా రూ.25 లక్షలు అందజేసిన ఆంధ్రప్రదేశ్​ క్రికెట్​ అసోసియేషన్​

Cricketer Nitish Kumar Reddy Met CM Chandrababu
Cricketer Nitish Kumar Reddy Met CM Chandrababu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2025, 9:31 PM IST

Cricketer Nitish Kumar Reddy Met CM Chandrababu: క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆస్ట్రేలియా టూర్​లో సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డిని సీఎం అభినందించారు. సీఎంను ఆంధ్ర క్రికెట్ అసోసియషన్ అపెక్స్​ బాడీతో కలిసి కలిసామని నితీష్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆస్ట్రేలియాలో 100 చేసినా మ్యాచ్ కోల్పోవడం బాధ అనిపించిందని వెల్లడించారు. క్రికెట్ అనేది ఒక టీం గేమ్ అందరూ రాణిస్తేనే విజయం సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. లాస్ట్ రెండు ఇన్నింగ్స్​లో కాస్త తడబడ్డా అంతకు ముందు ఇన్నింగ్స్​లో లైన్ చివరలో వచ్చినా దేశం కోసం రన్స్ సాధించానన్నారు.

నితీష్​కుమార్​ను కలిసిన విషయాన్ని చంద్రబాబు ఎక్స్​లో పోస్ట్​ చేశారు. ప్రపంచ వేదికపై భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన నితీష్ తెలుగు జాతికి మెరుస్తున్న స్టార్ అని అన్నారు. తన ప్రయాణంలో అతనికి మద్దతు ఇచ్చిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. నితీష్ మరెన్నో సెంచరీలు సాధించి రానున్న రోజుల్లో విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున సభ్యులు అందరం నితీష్​తో సీఎంను కలిసామని ఎంపీ చిన్ని వెల్లడించారు. నితీష్ ప్రతిభకు తాము ప్రకటించిన 25 లక్షల చెక్ సీఎం ద్వారా అందించామన్నారు. ఐపీఎల్​కు రాష్ట్రం నుండి గతేడాది ఐదుగురు ఎంపిక అయ్యారు. వచ్చే ఏడు 15 మంది ఎంపిక అయ్యేలా కృషి చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా తామంతా క్రీడలను ప్రోత్సహిస్తున్నామని అపెక్స్ సభ్యులు తెలిపారు.

అంతకుముందు నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అధ్యక్షుడు, విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్, ఏసీఏ కార్యద‌ర్శి రాజ్యస‌భ ఎంపీ, సానా స‌తీష్‌లను మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. నితీష్ కుమార్ రెడ్డిని ఎంపీలు ఇద్దరూ శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు. ఈ సంద‌ర్బంగా నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాలో జ‌రిగిన‌ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విశేషాల‌ను పంచుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ప్రతిభ‌ను చిన్నత‌నంలోనే గుర్తించి క్రికెట్​లో ప్రోత్సహించినందుకు నితీష్ కుమార్ రెడ్డి తండ్రి కె. ముత్యాల రెడ్డిని ఎంపీలు ప్రశంసించారు. త‌న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గడ్డపై సెంచ‌రీ సాధించి రికార్డ్ క్రియేట్ చేసిన నితీష్ కుమార్ రెడ్డికి ఎంపి కేశినేని శివ‌నాథ్ అభినంద‌నలు తెలిపారు. ఏపీలోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా క్రికెట్​లో రాణించాల‌నుకునే ఎంతో మంది క్రీడాకారులకు నితీష్ కుమార్ రెడ్డి స్పూర్తిగా నిలిచాడ‌ని కొనియాడారు.

టీ-20 సిరీస్‌ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా - మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన నితీశ్ కుమార్​రెడ్డి

"సెంచరీ కొట్టినపుడే నాతో మాట్లాడు" - నితీశ్​రెడ్డి పట్టుదల అంతా ఇంతా కాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.