CM Chandrababu and Pawan Kalyan met Union Ministers: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం మంచిగా జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ఎడమ, కుడి కాలువల నిర్మాణానికి చేసిన ఖర్చును రీయింబర్స్‌మెంట్ చేయాలని కోరినట్లు తెలిపారు. ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని విన్నవించినట్లు తెలిపారు.
గోదావరి నుంచి 200 టీఎంసీల వరద నీటిని బనకచెర్లకు తరలించే లక్ష్యంతో చేపట్టిన పోలవరం - బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు మద్దతు కోరినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రాన్ని కరవు రహితంగా మారుస్తుందని తెలిపారు. 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. పరిశ్రమలకు 20 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా కేటాయించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ భేటీ అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.
ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర జలవనరుల శాఖామంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ గారిని కలిశారు. చంద్రబాబుగారు ఆయనకు శాలువా కప్పి సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు. అనంతరం ఏపీలో జల్ జీవన్ మిషన్, సాగునీటి నిర్వహణ,… pic.twitter.com/NfkjQNv70N
— Telugu Desam Party (@JaiTDP) February 20, 2025
ఈ కార్యక్రమం అనంతరం ఎన్డీఏ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా విందు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి దేవేశ్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలోని మిర్చి రైతుల సమస్యపై చర్చించనున్నారు. మిర్చి రైతుల సమస్యపై ఇప్పటికే కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు.