Central on Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమైంది. రూ.11,500 కోట్ల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు కేంద్రవర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో ఆమోదం తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్ నడిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాదని గతంలోనే కేంద్రమంత్రి కుమారస్వామి వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మార్గాలపై పలుమార్లు మంత్రిత్వశాఖ చర్చలు జరిపింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి విధివిధానాలు, తదుపరి కార్యాచరణ వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను ఒకట్రెండు రోజుల్లో కుమారస్వామి వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.