పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. నూతన కమిటీ చైర్మన్ బుచ్చి రాజు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం గ్రామ సచివాలయల వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. పంచాయతీ వ్యవస్థ ద్వారా ఉద్యోగుల నష్టం కలగకుండా లాభం జరగాలన్నారు. ముఖ్యంగా పార్ట్‌టైం ఉద్యోగుల్లో ఎక్కువ వయసు ఉన్నవారిని క్రమబద్ధీకరించాలని కోరారు. పంచాయతీ ఉద్యోగుల్లో క్యాటగిరి ఎక్కువగా ఉండడం వల్ల ప్రమోషన్ ఉండటం లేదని వాటిని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇది కూడా చదవండి.