ETV Bharat / state

పశ్చిమలో పంటలను మింగేసిన వరద గోదావరి - గోదావరి వరదలు అప్ డేట్స్

గోదావరి అన్నదాతకు కన్నీటి వరదను తెచ్చిపెట్టింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు వరద తాకిడికి నీట మునిగి తీవ్రంగా నష్టపోయారు. కరోనా వల్ల కష్టాల్లో ఉన్న రైతులకు గోరుచుట్టుపై రోకటిపోటులా వరద కన్నీళ్లు మిగిల్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఎగువనున్న మెట్టప్రాంతాలు, దిగువున గల గోదావరి లంకల్లో వాణిజ్య, ఉద్యానపంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

పశ్చిమలో పంటలను మింగేసిన వరద గోదావరి
పశ్చిమలో పంటలను మింగేసిన వరద గోదావరి
author img

By

Published : Aug 21, 2020, 8:37 PM IST

గోదావరి వరద వల్ల పశ్చిమగోదావరి జిల్లాలో పలు పంటలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. వేలాది హెక్టార్లలో వరిపొలాలు, పత్తి, మిరప, ఉద్యాన, కూరగాయల పంటలు నీటమునిగాయి. మెట్ట ప్రాంతాలు, లంక గ్రామాల్లో పంటనష్టం తీవ్రంగా నమోదైంది. కుండపోతగా కురిసిన వర్షాలతో వారం రోజులపాటు గోదావరి తీవ్రరూపం దాల్చింది. గోదావరిలో వరద కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పలు మండలాలు వరద తాకిడికి గురయ్యాయి. జిల్లాలో సుమారు 18 మండలాల్లో వరదలు, వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖల ప్రాథమిక అంచనా మేరకు ఐదు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ అంచనా నాలుగింతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నీటిలో ఉన్న పంటలను అధికారులు గుర్తించడం లేదని రైతులు వాపోతున్నారు. సుమారు 25 వేల హెక్టార్లలో పంటనష్టం ఉండే ఆస్కారం ఉందని రైతులు చెబుతున్నారు.

ముంపు గ్రామాలను ముంచెత్తిన వరద

జిల్లాలోని మెట్ట ప్రాంతమైన వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాల్లో సుమారు 52 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వర్షాధారం కింద సాగుచేసిన వరి, పత్తి, మిరప పంటలను వరద ముంచెత్తింది. ముంపు మండలాల్లోని పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చొచ్చుకొచ్చింది. సాధారణంగా భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తేనే ముంపు మండలాల్లో పంటలు నీటమునిగేవి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మించిన ఎగువ కాఫర్ డ్యామ్ వల్ల గ్రామాలను వరద ముంచెత్తింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాకముందే.. వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాలను గోదావరి వరద ముంచేసింది. ఈ మూడు మండలాల్లోనే 20 వేల ఎకరాల పత్తి, మిరప చేలు వరదనీటిలో మునిగాయి. మెట్టప్రాంతంలో వర్షాధారం కింద.. అధికంగా రైతులు పత్తి సాగు చేస్తారు. సాగు చేసిన నెలరోజులు కాకమునుపే పంటకు నష్టం వాటిల్లింది.

90 శాతం మేర నీట మునిగిన పంటలు

జిల్లాలోని లంక గ్రామాలను కూడా గోదావరి వరద ముంచెత్తింది. లంక గ్రామాల్లోకి భారీగా వరదనీరు ప్రవేశించడంతో పంటలన్నీ నీట మునిగాయి. మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీరు నిలవడంతో పంట పనికి రాకుండా పోయింది. జిల్లాలో ఆచంట, యలమంచలి మండలాల్లో పది లంక గ్రామాలు ఉన్నాయి. ఆచంట మండలంలోని అయోధ్యలంక, పుచ్చలలంక, రాయలంక, మర్రిమూల, కాపులపాలెం, అనగారిలంక, పల్లిపాలెం యలమంచలి మండలంలో కనకాయలంక, యలమంచలిలంక, దొడ్డిపట్ల గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఈ లంక గ్రామాల్లో 90శాతం మేర పంటలు నీటమునిగాయి.

చిన్న రైతులకు పెద్ద దెబ్బ

అరటి, తమలపాకు తోటలు, కూరగాయలు, పశుగ్రాసం, మునగ వంటి ఉద్యాన పంటపొలాల్లో వరద నీరు చేరింది. ఎకరం తమలపాకుల సాగుకు రూ. 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని, వరదతో పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందారు. తమలపాకుల తోటలు, అరటితోటలు, కూరగాయలు, మునగ తోటల్లో పది రోజులుగా నీరు నిలవడం వల్ల.. పంటలు కుళ్లిపోతున్నాయి. లంకగ్రామాల్లో సుమారు 10 వేల ఎకరాల వరకు ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. లంకగ్రామాల ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పంటలు దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయామని.. జీవనాధారాన్ని కోల్పోయామని రైతులు అంటున్నారు.

పంట నష్టాన్ని అంచనా వేసి...ప్రతి రైతుకు పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : నెల్లూరులో విషాదం... రైలు కింద పడి తండ్రీకొడుకులు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.