Former MLA Bandaru Madhava Naidu rally: పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ.. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రదర్శన ఉద్రిక్తతకు దారి తీసింది. నర్సాపురంలో బండారు మాధవ నాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులతో ర్యాలీ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, తెదేపా నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళన మధ్యే.. తెదేపా శ్రేణులు ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఆక్కడనుండి పాదయాత్రగా ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ఇంటికి వెళ్తుండగా మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం.. అంబేడ్కర్ కూడలికి చేరుకుని దీక్ష చేస్తున్న వారికి మద్దతు పలికారు. అక్కడే వంటావార్పు నిర్వహించారు.
శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడం దారుణం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్న నర్సాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి - బండారు మాధవ నాయుడు, మాజీ ఎమ్మెల్యే
ఇదీ చదవండి