ETV Bharat / state

ఇళ్ల పట్టాల పంపిణీలో తెదేపా, వైకాపా నేతల మాటల యుద్ధం - ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, వైకాపా నేత నర్సింహరాజు మధ్య వివాదం

ఇళ్ల పట్టాల పంపిణీలో.. తెదేపాకు చెందిన ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, వైకాపా కన్వీనర్ పీవీఎల్​ నర్సింహరాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. పశ్చిమగోదావరి పాలకోడేరు మండలం మోగల్లులో.. సభా వేదికపైనే గందరగోళ వాతావరణం ఏర్పడింది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

dispute in housing land distribution
ఇళ్ల పట్టాల పంపిణీలో వివాదం
author img

By

Published : Dec 25, 2020, 7:52 PM IST

పశ్చిమగోదావరిలోని పాలకోడేరు మండలం మోగల్లులో.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రాసాభాసగా మారింది. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, నియోజకవర్గ వైకాపా కన్వీనర్ పీవీఎల్​ నర్సింహరాజుల మధ్య.. సభలో మాటల యుద్ధం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పోలీసులు కల్పించుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.

పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో.. తనపై ఏ కేసులూ లేవని, ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు పేర్కొన్నారు. వివాదాలకు తాను దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఈలోపు వైకాపా కన్వీనర్ పీవీఎల్ నర్సింహరాజు అడ్డుతగిలి.. తమపైనా కేసులు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటామాటా పెరిగి వివాదానికి దారితీసి.. ఒక్కసారిగా వేదికపై గందరగోళ వాతావరణం నెలకొంది.

ఇదీ చదవండి:

రైతుల వద్ద లంచం... ఏఎంవీఐపై సస్పెన్షన్ వేటు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.