విద్యుత్తు తీగ తెగి పడి చెలరేగిన మంటలు, ముగ్గురు రైతులకు చెందిన కోళ్ల ఫారాలు కాలిపోవడానికి కారణమయ్యింది. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రత్నాలు గుంటలో గడ్డం మోహన్ రావుకు చెందిన కోళ్లఫారాలపై విద్యుత్ తీగలు తెగిపడి మంటలు చెలరేగాయి. గాలుల ధాటికి మంటలు పక్కనే ఉన్న ప్రవళిక అనే మహిళ రైతుకు చెందిన షెడ్లకు వ్యాపించాయి. ఆ తర్వాత సర్వేశ్వరావు చెందిన షెడ్లూ కాలిపోయాయి. గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది షెడ్లు కాలిపోగా, సుమారు 30 లక్షల రూపాయల మేర రైతులకు నష్టం వాటిల్లింది. విద్యుత్తు తీగ తెగి పడడం వల్ల జరిగిన నష్టాన్ని విద్యుత్ శాఖ అధికారులు పూరించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి.....