'మూడు రాజధానులకు మద్ధతుగా వైకాపా శ్రేణులు మానవహారం' - latestnews ysrcp Activists support to three capitals
విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా శ్రేణులు మానవహారం నిర్వహించారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు వివిధ సంఘాల మహిళలు వైఎస్ఆర్ విగ్రహం వద్ద మానవహారంతో మద్దతు పలికారు. ఉత్తరాంధ్ర విశాఖ పరిపాలనా రాజధానిగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 'అమరావతి వద్దు - మూడు రాజధానులు ముద్దు' అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
మూడు రాజధానులకు మద్ధతుగా వైకాపా కార్యకర్తలు మానవహారం
By
Published : Feb 7, 2020, 10:42 AM IST
మూడు రాజధానులకు మద్ధతుగా వైకాపా కార్యకర్తల మానవహారం