జోహరాపురంలో పాఠశాల భవన నిర్మాణానికి భూమిపూజ - Foundation school building in Joharpuram news
కర్నూలు జిల్లా జోహరాపురంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ భూమిపూజ చేశారు. నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్టు చెప్పారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నతశిఖరాలు అధిరోహించాలని విద్యార్థులకు చెప్పారు. యాబై లక్షల రూపాయల నిధులతో జోహరాపురం ఏ - క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.