విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కరకాం గ్రామంలో అరుదైన తెల్ల కాకి కనిపించింది. తెలుపు రంగులో ఉన్న పక్షి 'కావ్...కావ్' అంటూ అరుస్తుందేంటని మొదట ఆశ్చర్యపోయిన స్థానికులు... ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని ఆసక్తిగా తిలకించారు. కొంత మంది దీని ఫోటోలను సెల్ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఈ శ్వేత వర్ణంలో ఉన్న కాకి చిత్రాలను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
ఇదీ చదవండి