విజయనగరం శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి.. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, భద్రతా సిబ్బందికి నిత్యావసర సరుకులు అందచేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు తిండికి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెప్మా పీడీ సుగుణాకరరావు ఆధ్వర్యంలో మహిళా సంఘాలు కరోనా నివారణ సహాయార్ధం సీఎం సహాయ నిధికి 4 లక్షల 70వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యేకు అందచేశారు.
ఇవీ చదవండి: