కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో కర్ణాటక నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలివస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని మంత్రాలయానికి చెందిన ముగ్గురు వ్యక్తులు... లక్షా 70 వేల రూపాయలు విలువ చేసే 350 గుట్కా ప్యాకెట్లను కారులో తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. కారును సీజ్ చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: