ఒక్క పాజిటివ్ కేసు లేకుండా గ్రీన్‌జోన్ పరిధిలో నిలిచిన విజయనగరం జిల్లాను కాపాడేందుకు అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. పోలీసులు జిల్లా సరిహద్దులు మూసివేసి.. కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద వైద్య సిబ్బందితో మెుబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పూర్తిగా పరీక్షించిన తర్వాతే అనుమతిస్తున్నారు. వైద్య, రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కూడిన బృందాలు వలసదారులను పరీక్షించి.. ఫలితాలను బట్టి హోం కార్వంటైన్, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు. కరోనా రహిత జిల్లాగా చేసేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై మా ప్రతినిధి అందిస్తున్న వివరాలు..!
ఇవీ చదవండి..