Two lorries collided On National Highway : విజయనగరం జిల్లా గజపతి నగరం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. సాలూరు వైపు నుంచి వస్తున్న ట్యాంక్ లారీ.., ఒడిశా వైపు వెల్తున్న బొగ్గు లారీ బలంగా ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇరు లారీల డ్రైవర్లు, క్లీనర్లు నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. క్షత గాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో గజపతి నగరంలో ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన జయత్, సభబ్, ఛతీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన గురు చరణ్ సింగ్, షలిష్ గా గుర్తించారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయిన పత్తి : కర్నూలు జిల్లా ఆదోనిలోని పత్తి పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాధవరం రోడ్డులో ఉన్న నాగరాజు అండ్ సన్స్ కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పత్తి కాలిపోయింది. అగ్ని ప్రమాదంలో నాలుగు కోట్లు విలువ చేసే పత్తి కాలి బూడిద అయ్యయిందని యజమాని వాపోయారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పరిశ్రమలో 10 కోట్ల వరకు పత్తి నిల్వలు ఉన్నాయని, కూలీలు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో చాలా పత్తి బేలు కాలిపోకుండా చూశారని యాజమాని నాగరాజు తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం : వైఎస్సార్ జిల్లా నుంచి కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలిస్తున్న 26 టన్నల రేషన్ బియ్యాన్ని మంగళగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బద్వేల్లోని ఓ రైస్ మిల్ యజమాని సునీల్ లారీలో 500 బస్తాలు కాకినాడకు తరలిస్తున్నారని, లారీ గుంటూరు జిల్లా తెనాలి దగ్గర మరో 45 బస్తాలు వేసుకొని మంగళగిరి వైపు వస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా బియ్యం తరలిస్తున్న లారీ మంగళగిరి మండలం పెదవడ్లపూడి వద్దకు చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనుమానాస్పద మృతి : ప్రకాశం జిల్లా కొండేపి గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద కాపలాగా ఉన్నా సంఘం సుబ్బారెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు . దోమతెర వేసుకొని మద్యం శాపు దుకాణం ముందు నిద్రపోయిన సుబ్బారెడ్డి ఉదయం చూసేసరికి విగత జీవిగా పడి ఉన్నాడు. తలపై బలమైన గాయాలు ఉన్నాయి . గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి చేయడం వల్ల మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసుల అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకోని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. దుకాణం ముందు సీసీ కెమెరాలు లేకపోవడంతో ఏమి జరిగిందనే విషయం నిర్ధారించుకోలేకపోతున్నారు.
ఇవీ చదవండి