రాష్ట్రంలో గిరిజన సలహా మండలిని పునర్నిర్మిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణిని గిరిజన సలహా మండలి ఛైర్పర్సన్గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. గిరిజన శాఖ కార్యదర్శి , ఎస్సీ ఎస్టీల విభాగం డైరెక్టర్ , గిరిజన సంక్షేమశాఖ కమిషనర్లను సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సలహా మండలిలో సభ్యులుగా ఎమ్మెల్యేలను ప్రతిపాదిస్తూ అదేశాలిచ్చారు. పాలకొండ శాసనసభ్యురాలు విశ్వారాయి కళావతి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, అరకు శాసనసభ్యుడు శెట్టి పాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, రంపచోడవరం శాసనసభ్యురాలు ఎన్. ధనలక్ష్మి, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజులను గిరిజన సలహా మండలి సభ్యులుగా నియమించారు. మూడేళ్ల కాలపరిమితి ఉండేలా ఈ గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా అదేశాలు జారీ చేశారు.
ఇవీ చదవండి..