విజయనగరం జిల్లా కొమరాడలో సొంత అత్త ఇంటికే అల్లుడు కన్నం వేశాడు. సోదరుడితో కలిసి బంగారు ఆభరణాలు తస్కరించాడు. కొమరాడకు చెందిన అక్కమ్మ చిన్న అల్లుడు ఆవాల గణేశ్.. (son in-law theft gold) ఇల్లరికం వచ్చాడు. అత్త, మామ ఇంటిలో లేని సమయంలో సోదరుడు సింహాచలంతో కలిసి ఈనెల 2న చోరీకి పాల్పడ్డాడు. బంగారు ఆభరణాలు సోదరులు దొంగిలించారు. పోలీసు విచారణలో తానే చోరీకి పాల్పడినట్లు గణేశ్ అంగీకరించాడు. 8 తులాల బంగారం, 20వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం..
కొమరాడ మండలానికి చెందిన అక్కమ్మకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెను వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేసింది. మిగిలిన ఇద్దరు కుమార్తెలను సీతానగరం మండలం పాపమ్మవలస గ్రామానికి చెందిన ఆవాల సింహాచలం, ఆవాల గణేష్ అనే అన్నాదమ్ములకు ఇచ్చి వివాహం చేసింది. వీరిలో చిన్న అల్లుడు అవాల గణేష్ అత్తవారింటికి ఇల్లరికం వచ్చి, ఇంటి వ్యవహారాలు చూసుకుంటున్నాడు.
అతని మామ.. గొర్రెల వ్యాపారం చేస్తుంటాడు. ఈ పని నిమిత్తం రోజుల తరబడి బయటకు వెళ్తుంటారు. అత్త అక్కమ్మ అరటి పండ్ల వ్యాపారం చేస్తుంది. వీళ్లిద్దరూ బయటకు వెళ్ళిన సమయం చూసిన గణేష్.. చోరీకి ప్లాన్ చేశాడు. తన అన్న సింహాచలానికి విషయం చెప్పి, కొమరాడకు రప్పించాడు. అక్టోబర్ 2 రాత్రి 11 గంటల సమయంలో పని పూర్తి చేశారు. ఇంట్లోని పుస్తుల తాడు సహా.. బంగారం దొంగిలించి(son in-law theft gold) పారిపోయారు.
ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో సేకరించిన ఆధారాలను బట్టి, చిన్న అల్లుడు గణేష్‌ను విచారించి.. అసలు వాస్తవాలను రాబట్టారు. ఆవాల గణేష్ (ఎ-1) ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. అతని అన్న సింహాచలం (ఎ-2)ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 20 వేల నగదు, 8 తులాల బంగారం పోలీసులు స్వాధినం చేసుకున్నారు. అనంతరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పార్వతీపురం డీఎస్పీ సుభాష్ తెలిపారు.
ఇదీ చదవండి..