విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టులో రెండో రోజూ దస్త్రాల అన్వేషణ కొనసాగింది. ఆడిట్ అధికారులు కోరిన మేరకు ట్రస్టు సిబ్బంది దస్త్రాలను అందించారు. మాన్సాస్ కార్యాలయంలో దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సురేష్‌బాబు.. అధికారులతో ఆడిట్ నిర్వహణపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆడిట్‌కు పూర్తిస్థాయిలో సహకరించాలని ట్రస్టు అధికారులను సురేష్‌బాబు ఆదేశించారు. నాలుగైదు ఏళ్ల దస్త్రాలు తనిఖీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎంత మంది సిబ్బంది అవసరం.. ఎన్ని రోజుల సమయం పడుతుంది... అనే అంశాలను రెండోరోజు పరిశీలించారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మాన్సాస్ వ్యవహారం వివాదస్పదమైన వేళ.. ట్రస్టు ఆడిట్ పూర్తిచేసేందుకు జిల్లా అధికారులు.. కమిషనర్ నుంచి ప్రత్యేక అనుమతి కోరినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండీ.. High Court: ప్రభుత్వ విధానాలపై భిన్నాభిప్రాయం చెబితే గొంతు నొక్కేస్తారా?: హైకోర్టు