విజయనగరం జిల్లా సాలూరు పురపాలక సంఘం చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక.. ఎన్నికల ప్రత్యేక అధికారి, జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చైర్ పర్సన్‌గా పువ్వల ఈశ్వరమ్మ ఎన్నికయ్యారు. వైస్ చైర్ పర్సన్‌గా జరజాపు దీప్తిని ప్రకటించారు. ఎంపికైన వారికి అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్సీ సంధ్యారాణి, పలువురు నేతలు అభినందించారు. ఎమ్మెల్యే రాజన్నదొర, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారని.. అందుకే ప్రజలు తమకు ఇంత విజయం అందించారని ఎంపీ మాధవి అన్నారు. నగర అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్సీ సంధ్యారాణి కోరారు.
ఇవీ చూడండి...: బొబ్బిలి ఛైర్మన్ పీఠంపై రాజుకున్న వివాదం..