ఇంట్లో ఉన్న భార్య, కుటుంబ సభ్యులకు పండగకు దుస్తులు కొనేందుకు వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఎస్‌కోట మండలంలోని రాజీపేట- గౌరీపురం రహదారి సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ఘటనలో విశాఖజిల్లా అనంతగిరి మండలం సారవానిపాలెంకు చెందిన కూడ సన్యాసిరావు (32) మృతి చెందాడు. అనకాపల్లి సమీప క్వారీలో డ్రిల్లరుగా పని చేస్తున్న సన్యాసిరావుకు ఏడాది క్రితం వివాహమైంది.
సంక్రాంతి సందర్భంగా దుస్తులు, నిత్యావసర సరకులు కొనేందుకు ఎస్‌కోట వెళ్లాడు. అక్కడి నుంచి ఆటోలో ఇంటికి వెళ్తుండగా బొడ్డవర వైపు నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొంది. వెనుక కూర్చొన్న సన్యాసిరావుపై ఆటో పడిపోగా.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న కాశీపట్నం వాసి వరలక్ష్మి అనే మహిళకు కాలు విరిగింది. మరో ఇద్దరికి, కారు చోదకుడికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: