ఆ దంపతులు జీవన స్రవంతిలోనే కాదు. మరణంలోనూ కలిసే ప్రయాణించారు. విజయనగరం జిల్లా పెనుబర్తి గ్రామంలో నివాసముంటున్న ముళ్ళు నరసింహులు నిన్న మధ్యాహ్నం 3గంటలకు మృతి చెందాడు. భర్త ఎడబాటును తట్టుకోలేక భర్త మృతదేహం వద్ద విలపిస్తూ భార్య గురమ్మ కూడా అనంతలోకాలకు వెళ్లిపోయింది. వృద్ధ దంపతులిద్దరు ఒకేసారి మరణించటం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఇంతవరకు గ్రామంలో ఇలాంటి ఘటన జరగలేదని గ్రామస్థులు వాపోయారు.
ఇదీ చదవండి: అమెజాన్, ఫ్లిప్కార్ట్ 6 రోజుల అమ్మకాలు ఎంతో తెలుసా...?