మాతృ వియోగం కలిగిన మంత్రి బొత్స సత్యనారాయణను... సహచర మంత్రులు ధర్మాన కృష్ణదాస్, కొడాలి నాని పరామర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా విజయనగరం వచ్చిన మంత్రులు... బొత్స నివాసానికి వెళ్లి ఆయన మాతృమూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు.
మంత్రులతో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పలువురు ప్రజాప్రతినిధులు అంజలి ఘటించారు. మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ(87) అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు.
ఇదీ చదవండి: