ETV Bharat / state

'అందరి స‌హ‌కారంతోనే జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు' - క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్​కు అభినందన సభ

విజయనగరం జిల్లా రెవెన్యూ కల్యాణ మండపంలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కలెక్టర్​కు ఆత్మీయ అభినంద సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్​ను​ సత్కరించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ర‌క్త‌దాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

అందరి స‌హ‌కారంతోనే జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు
author img

By

Published : Dec 4, 2020, 7:32 PM IST

జ‌ల సంర‌క్ష‌ణ‌లో విజయనరం జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపుతోపాటు ఇటీవ‌లే ఇండియ‌న్ ఎచీవ‌ర్స్ ఫోర‌మ్ నుంచి మేన్ ఆఫ్ ఎక్స్‌లె‌న్స్‌గా ఎంపికైన క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్​ను ప‌లు‌ స్వ‌చ్ఛంద సంస్థ‌ల ఆధ్వర్యంలో సత్కరించారు. ఆయన పొందిన పురస్కరాలు, సేవలను కొనియాడుతు జ్ఞాపికలు అందచేశారు. స్థానిక రెవెన్యూ కల్యాణమండపంలో ఛైల్డ్‌రైట్స్ ప్రొటెక్ష‌న్ ఫోర‌మ్‌, చేయూత ఫౌండేష‌న్‌, నా ఊరు-విజ‌య‌న‌గ‌రం, స్ఫూర్తి యూత్ అసోసియేష‌న్‌, అబ్దుల్ క‌లామ్ సేవా సంఘం, మాతృభూమి సేవాసంఘం, ఇతర సంస్థ‌లు సంయుక్తంగా ఆత్మీయ అభినంద సభ ఏర్పాటు చేశారు.

ర‌క్త‌దాన శిబిరాన్ని  ప్రారంభించిన కలెక్టర్

ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అందరి స‌హ‌కారంతోనే జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు సాధ్యమైందన్నారు. చిత్త‌శుద్దితో, మ‌న‌స్ఫూర్తిగా ప‌నిచేడం వ‌ల్లే అవార్డులు ల‌భిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఆయన ప్రారంభించిన కార్య‌క్ర‌మాలు భ‌విష్య‌త్తులోనూ నిరంత‌రాయంగా కొన‌సాగుతాయని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అంతకుముందు జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థలు, జిల్లా నీటి యాజ‌మాన్య సంస్థ‌ సంయుక్తంగా నిర్వహించిన ర‌క్త‌దాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఇదీ చూడండి:

'50 ఏళ్లపాటు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఆర్టీసీకి తిరిగి వస్తాయా..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.