విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని జిగిరాం గ్రామంలో జ్యూట్ మిల్లు నాలుగు రోజులపాటు మూసివేయనున్నారు. ఈ విషయాన్ని కార్మిక సంఘం యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. తాలూరు పట్టణంలోని కరోనా కేసులు పెరగడంతో ఆందోళన చెంది కార్మిక సంఘాలు, యజమాన్యం చర్చలు జరిపాయి. ఇరువర్గాల అంగీకారంతో మిల్లును నాలుగు రోజులపాటు మూసి వేయాలని నిర్ణయించారు. ఆదివారం నాడు పరిస్థితిని సమీక్షించి సోమవారం నుంచి మిల్లును యధావిధిగా నడిపే విషయాన్ని పరిశీలిస్తామని యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్త జిల్లాలు... అధ్యయనానికి కమిటీ ఏర్పాటు