కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ అనంతరం తొలిసారిగా విజయనగరంలో ఓ థియేటర్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. రోజుకు మూడు ఆటలు వేయనున్నట్టు థియేటర్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చిన వారికి ముందుగా శానిటైజ్ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. థియేటర్ను పూర్తిగా శానిటైజ్ చేయడం, సీటు సీటుకు మధ్య భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. మాస్కులేని వారిని లోపలికి అనుమతించబోమని చెప్పారు. టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నారు. అంతేకాకుండా సినిమా విరామం సమయంలో వేడి పదార్థాలు, స్నాక్స్ అందుబాటులో ఉంచుతామన్నారు.
ఇదీ చదవండి :