విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట గ్రామానికి చెందిన యువరైతు సాయం రఘనాథ్.. సాగులో కొత్త మెళకువలతో అద్భుతాలు సృష్టించాడు. తన వ్యవసాయ క్షేత్రంలోని 50 సెంట్ల భూమిలో ఏడు రకాల దేశవాళీ వరి రకాలను పండించి అబ్బురపరిచాడు.
గని, దూదేశ్వరీ, కులాకర్, నవారా, పంచరత్నం, రత్న, చడీ వంటి వరి రకాలను పండించి వ్యవసాయాధికారుల మన్ననలను పొందాడు. వ్యవసాయంలో సరికొత్త ఆలోచనలతో ముందుకెళితే.. ఉన్నతమైన ఫలితాలు సాధించవచ్చని రఘునాథ్ నిరూపించాడు.