ETV Bharat / state

కరోనా బాధితురాలు మృతి.. ఖననంపై వివాదం - కరోనాతో మరణించిన విజయనగరం జిల్లా మహిళా న్యూస్

విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళ.. విశాఖ విమ్స్ ఆసుపత్రిలో కరోనా వైరస్ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని కరాసలోని క్రిస్టియన్, హిందూ శ్మశాన వాటికలో కరోనా నిబంధనల ప్రకారం జీవీఎంసీ సిబ్బంది ఖననం చేయగా... స్థానికులు ఆందోళన చేపట్టారు. చేసేది లేక ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసి జ్ఞానాపురంలోని హిందూ శ్మశాన వాటికకు తరలించారు. మృతురాలి కుమారుడి సమక్షంలో హిందూ సంప్రదాయ పద్దతిలో దహనం చేశారు.

కరోనా చికిత్స పొందుతూ మహిళా మృతి
కరోనా చికిత్స పొందుతూ మహిళా మృతి
author img

By

Published : May 11, 2020, 12:23 PM IST

విజయనగరం జిల్లాకు చెందిన ఓమహిళకు ఇటివల కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెకు విశాఖ విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. నిబంధనల ప్రకారం ఆమె ఏ ఊరిలో చనిపోతే ఆ ఊరిలోనే అంతిమ సంస్కారం చేయాల్సి ఉంది. ఈమె క్రైస్తవ మతానికి చెందినందువల్ల ఈమె మృతదేహాన్ని కరాసలోని క్రిస్టియన్, హిందూ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు.

కరోనా నిబంధనల ప్రకారం జీవీఎంసీ సిబ్బంది పాతిపెట్టారు. అయితే ఇంతలో దగ్గరలోని స్థానిక ప్రజలకు విషయం తెలిసింది. కొవిడ్ దుస్తుల్లో ఉన్న జీవీఎంసీ సిబ్బందిని చూసి ఆందోళన చేపట్టారు. కరోనాతో మృతిచెందిన ఈమె మృతదేహాన్ని ఇక్కడ పాతిపెట్టడానికి వీల్లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శాస్త్రి ఘటనాస్థలానికి చేరుకొని స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

చేసేదిలేక పాతి పెట్టిన శవాన్ని బయటకు తీసి జ్ఞానాపురంలోని హిందూ శ్మశాన వాటికకు తరలించారు. మృతురాలి కుమారుడి సమక్షంలో హిందూ సంప్రదాయ పద్దతిలో దహనం చేశారు.

ఇదీ చూడండి:

మరో 50 మందికి పాజిటివ్: రాష్ట్రంలో కరోనా కేసులు 1980

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.